Wednesday, March 25, 2009

శ్రీ విరోధినామ సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు.

మిత్రులందరకు శ్రీ విరోధినామ సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు.

చాలామంది విదేశాల్లో ఉన్నవారు భారతీయ పంచాగాన్నే వాడుతున్నారు. కాని వారు ఉన్న
ప్రదేశానికి భారత కాలమానం ప్రకారం తయారు చెయ్యబడ్డ పంచాంగం పనికిరాదు.

క్రిందటి సంవత్సరం శ్రీ పిడపర్తి పూర్ణయ్య విజ్ఞాన ట్రస్ట్ వారు భారతీయులు (తెలుగువారు) ఎక్కువగా ఉన్న
కొన్ని ముఖ్య విదేశీ పట్టణాలకు కాలెండరు తయారు చేసి అంతర్జాలములో ఉంచినారు.

ఈసంవత్సరం ఇంకొక కొత్త ప్రయోగాన్ని వారు చేస్తున్నారు. దీనితో మీరు ప్రపంచం లో ఏ ప్రదేశమునకయినను పంచాంగ వివరములు
తిథి, నక్షత్రము మొదలయినవి తెలుసుకొనవచ్చును. వారి అంతర్జాల చిరునామా క్రింద ఇస్తున్నాను

www.vishwapanchang.info

ఇంక జాగెందుకు. మీమీ బంధువులకు, మిత్రులకు ఈ సమాచారాన్ని తెలియజెయ్యండి. మీ అభిప్రాయాలను
వారికి తెలియ చెయ్యండి.